Defamation Case On Pawan Kalyan: విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరువునష్టం పిటిషన్ దాఖలైంది.. పవన్‌పై పిటిషన్ వేశారు ఓ వాలంటీర్.. ఇక, వాలంటీర్ ఇచ్చిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు న్యాయమూర్తి.. తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించినంటున్నారు మహిళా వాలంటీర్.. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు.. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని.. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది.. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు.
అయితే, ఈ కేసులో పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందంటున్నారు బాధితురాలి తరపున న్యాయవాదులు.. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయి.. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారు.. ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని అంటున్నారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.. పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని.. పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలన్నారు. వదంతులతో ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు వెల్లడించారు బాధిత వాలంటీర్ తరపు న్యాయవాదులు.