Rahul On Defamation Case: పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే అవకాశమివ్వండి: సుప్రీం అఫిడవిట్‌లో రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul On Defamation Case: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టు అఫిడవిట్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. పరువు నష్టం కేసులో తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ‘మోడీ ఇంటి పేరు’ కేసులో ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకుంటుంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేసిన రాహుల్ గాంధీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.
Read also: Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టే AI..
Also Read
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేష్ మోడీ పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ అఫిడవిట్‌లో సుప్రీంకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!