ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో…