నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు దశాబ్దం తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలుచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. దీంతో.. పదేళ్ల తర్వాత టీమ్ విజయం సాధించడంతో జట్టులోని ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు.