Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు…
ఓ వైపు కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అమలైన మరణ శిక్షల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 2020తో పోలిస్తే 2021లో మరణ శిక్షలు దాదాపుగా 20 శాతం పెరిగినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. 2021లో 18 దేశాలు 579 మరణ శిక్షలను విధించాయి అని వెల్లడించింది. 2020లో 246 మంది నుంచి 314 మందికి మరణశిక్షలు విధించారు. ముఖ్యంగా ఇరాన్ లో గత నాలుగు సంవత్సరాల్లో మరణశిక్షల సంఖ్య పెరిగింది.…