తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి. చక్రవర్తి అసలు…
గురువేమో నవ్వు నాలుగు వందల విధాల గ్రేటు అన్నారు. శిష్యుడేమో ఆ సూత్రాన్ని పట్టుకొని నలుదిశలా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ గురువు ఎవరంటే ‘నవ్వడం భోగం… నవ్వించడం యోగం… నవ్వకపోవడం రోగం…’ అని చాటిన జంధ్యాల. ఇక ఆ శిష్యుడు ‘నవ్వేందుకే ఈ జీవితం’ అన్నట్టుగా సాగిన ఇ.వి.వి సత్యనారాయణ.తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ మొదలు చివరి దాకా ఏ సినిమా తీసినా, వాటిలో నవ్వులకే పెద్ద పీట వేశారు ఇ.వి.వి. అందుకే ఆయన సినిమాలు…
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు…
పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా…
కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా మధురగాయకుడు మహ్మద్ రఫీ గానం మురిపించింది. ఆయన గాత్రంలో జాలువారిన వందలాది పాటలు ఈ నాటికీ అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. మహ్మద్ రఫీ అనగానే తెలుగువారికి యన్టీఆర్ ‘భలేతమ్ముడు’ చిత్రం ముందుగా గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ సినిమా కంటే ముందే నటగాయక నిర్మాతదర్శకుడు చిత్తూరు వి.నాగయ్య నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘రామదాసు’లో మహ్మద్ రఫీ పాట పాడారు. అందులో కబీర్ పాత్ర ధారి గుమ్మడికి రఫీ…
నేడు భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 57వ వర్ధంతి. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని శాంతివన్లో గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం, నెహ్రూ చెప్పిన మాటలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. ‘విచ్చలవిడిగా చెడు విజృంభిస్తే.. అది మొత్తం వ్యవస్థనే…