మంగళవారం హైదరాబాద్ చందానగర్‌లోని ఖాజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు దోపిడీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పట్టపగలు తుపాకులతో చొరబడిన దుండగులు 10 నిమిషాల పాటు షాప్‌లో బీభత్సం సృష్టించారు. ఖాజానా జ్యువెలరీ సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి.. వెండి వస్తువులు, 1గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై తాజాగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా…