ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిక్‌లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..
World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి…
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్,…
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం దావోస్ బయల్దేరారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి సీఎస్, అధికారులు విషెస్ చెప్పారు. 'సీఎం సర్.. ఆల్ ది బెస్ట్' అంటూ విష్ చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని.. అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు. బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం ప్రయత్నం చేయనున్నారు. మొదటిరోజు జ్యూరిచ్‌లో 10 మంది పారిశ్రామికవేత్తలతో…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అటవీ భూముల అనుమతులపై చర్చించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి, రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని కోరారు. భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో…
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..! అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు…