Telangana Govt: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ దక్కించుకుంది.
Amazon: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది.
Infosys: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడనికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు... రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. అవకాశం దొరికొనప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు..
Maharastra : బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈరోజు ఒక పెద్ద ప్రకటన చేశారు.
దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను కోరారు సీఎం చంద్రబాబు.
దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
Congress: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025లో పాల్గొనేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఇదే అక్కడ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న అధికార కుమ్ములాటలే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.