Daughters Day 2024: భారతదేశంలో ప్రతి సంవత్సరం లాగానే, ఈ సంవత్సరం కూడా నేడు డాటర్స్ డే (కుమార్తెల దినోత్సవం) జరుపుకుంటున్నారు. ఇది ప్రతి ఏడాది సెప్టెంబర్ 22 జరుపుకుంటారు. కుమార్తెల దినోత్సవం అనేది కుమార్తెలు – తల్లిదండ్రుల మధ్య విడదీయరాని బంధాన్ని జరుపుకోవడమే కాకుండా.. సమాజంలో ఆడపిల్లలకు సమానమైన, గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భారతదేశంలో, ఆడపిల్లల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడానికి, వారిని శక్తివంతం చేయడానికి ఈ రోజును జరుపుకుంటారు.…