Russia: భారీ భూకంపంతో దెబ్బతిన్న రష్యా అణు సబ్ బేస్!
- భారీ భూకంపంతో దెబ్బతిన్న రష్యా అణు సబ్ బేస్!
- ఫొటోలతో వార్తాకథనం
- అధికారికంగా ధృవీకరించని రష్యా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలో గత వారం భారీ భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు జారీ అయ్యాయి. ఇక నగరాలు.. నగరాలే ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక పసిఫిక్ సముద్ర తీరంలో భారీ నష్టాన్ని చవిచూసింది.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
అయితే భూకంపం సందర్భంగా రష్యా అణు సబ్ బేస్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కమ్చట్కా ద్వీపకల్పంలోని రైబాచియ్ జలాంతర్గామి స్థావరంలో తేలియాడే పైర్‌కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ మేరకు వాణిజ్య ఉపగ్రహ ఇమేజింగ్ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫొటోల్లో కనిపిస్తున్నట్లుగా ఓ వార్తాపత్రిక నివేదించింది. ఓడరేవులోని ఒక భాగం దాని యాంకర్ పాయింట్ నుంచి విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఓడరేవు కూడా భారీగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. అంతే తప్ప పెద్ద విధ్వంసం జరిగినట్లుగా కనిపించలేదు. అయితే దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
ఇది కూడా చదవండి: Tollywood : మన సినిమాలు.. మనకే తిరిగి చూపిస్తున్న ఇతర ఇండస్ట్రీలు
గత బుధవారం రష్యాలోని ఫార్ ఈస్టర్న్ కమ్చట్కా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అత్యంత శక్తివంతమైన భూకంపం కారణంగా ఫ్రెంచ్ పాలినేషియా-చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం ద్వీపకల్పంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇదే అతి పెద్ద భూకంపం అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!