రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే సంవత్సరం దళిత బంధు క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తాం అని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. దళిత బంధు తో తమ కాళ్ళమీద తాము నిలబడేలా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. దళిత జాతికి సరికొత్త దశా దిశా చూపే కార్యక్రమం దళిత…
దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని భావించారు.. కానీ, తాను దత్తతకు తీసుకున్న వాసాలమర్రి నుంచే ఆ పథకం అమలుకు పూనుకున్నారు.. ఇప్పటికే ఆ గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రూ.10 చొప్పున ఫండ్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం.. మరోవైపు.. దళిత బంధుపై విమర్శలు వస్తున్నాయి.. ఆ విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దళిత బంధు పథకాన్ని బీజేపీ పార్టీ అడ్డుకునే ప్రయత్నం…
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత.…
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…