తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ దళిత బంధును అందజేయాలని కార్యచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటితో 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమకానున్నాయన్నారు.…
దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. మొదటగా తాను దత్తతతీసుకున్న వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతటా అమలు చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధులు కూడా విడుదల చేశారు.. అంతే కాకుండా.. మరికొన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే, దళితబంధు పథకం కింద…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు…
వచ్చే ఎన్నికలలోపు 5 లక్షల మందికి దళిత బంధు అందిస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును హుజురాబాద్‌లో సంపూర్ణంగా అమలై తీరుతుందని క్లారిటీ ఇచ్చారు.. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశామని…
దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి…
దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు పిటీషనర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్…
దళిత బందు అపడం లో తెరాస.. బీజేపీ తోడు దొంగలు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరి కుమ్మక్కు లో భాగమే దళిత బందు ఆగింది. రైతు బందు అగొద్దని ఎన్నికల కమిషన్ దగ్గర అమలు చేసిన కెసిఆర్..దళిత బందు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదు. దళిత బందు పాత పథకం అని తెరాస చెప్తుంటే… ఎందుకు ఇప్పుడు ఆగింది. సీఎం.. సీఏస్ ఎందుకు దళిత బందు అమలుకు చొరవ చుపట్లేదు. కేంద్ర మంత్రులు ఎందుకు ఎన్నికల…
ప్రభుత్వంని నడిపించాల్సిన సమయంలో పార్టీ మీద కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం ముందస్తు ఎన్నికలకు పోవడానికే అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు విజయ ఘర్జన సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ మీద పట్టుకోల్పోతున్నాననే భయం ఆయనలో ఉంది. బీజేపీ కూడా కేసీఆర్ కి సహకరించేందుకు హామీ ఇచ్చింది. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ వరస మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. హుజూరా బాద్ ఎన్నికల తరువాత పార్టీలో తిరుగుబాటు…
మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పా.. అలాగే 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించాం అని గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయి. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు అవకాశం ఇస్తా అని కాంగ్రెస్ నాయకులకు చెప్పిన ఆయన.. మీ శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తామని మాట ఇస్తున్న. కుల వృత్తులు కేసీఆర్ పుట్టక ముందే ఉన్నాయి. రాజ్యంలో వాట అడుగుతున్నాం. మేము రాజులుగా ఉంటాం..మీరు బానిసలుగా ఉండండి అంటున్నారు కేసీఆర్. తెలంగాణ పెద్ద కొడుకు కేసీఆర్ కాదు అని మండిపడ్డారు. నీకు ఇచ్చే నౌకరీ…