Dhakshina Murthy: ‘సంసారం సంసారం.. ప్రేమ సుధా తీరం.. నవజీవన సారం..’ అన్న మధురాన్ని 1950లో ‘సంసారం’ కోసం పలికించిన సుస్వరాల సుసర్ల దక్షిణా మూర్తి స్వరప్రయాణం తెలుగువారి మది పులకింపచేస్తూ సాగింది. గానకోకిల లతామంగేష్కర్ స్వరవిన్యాసాలను తెలుగులో తొలుత వినిపించిందీ ఆయనే. ‘సంతానం’లో లత పాడిన ‘నిదుర పోరా తమ్ముడా…’ గానం ఈ నాటికీ సంగీత ప్రియులను మురిపిస్తూనే ఉంది. ‘ఇలవేల్పు’ లోనూ ‘చల్లని రాజా ఓ చందమామ..’ పాటతో నిజంగానే ప్రేక్షకుల మదిలో చల్లని…