మాజీ ఆర్థిక మంత్రి యనమలకు తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తుని నుంచి యనమల కుటుంబం లేదా ప్రత్యర్ధి ఎవరైనా 15 వేలు మెజారిటీతో గెలుస్తాను. 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని పేర్కొన్నారు. నాపై గెలుపు సంగతి అలాఉంచి నాకు 15వేలు మెజారిటీ రాకుండా చూసుకోండి అని సవాల్ విసిరారు. ఐటీజే తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికలో టీడీపీ ఒక్కటి మాత్రమే గెలిచింది. తునిలో నిన్న టీడీపీ గౌరవసభలో యనమల కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కౌంటర్ ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ 10వేల మెజారిటీతో గెలుస్తుందని నిన్న సభలో యనమల పేర్కొన విషయం తెలిసిందే.