PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో…
PM Modi: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తొలిసారి ప్రధాని మోడీ కెనడా వెళ్తున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్‌లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఒమిక్రాన్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ మరణమృదంగం చేస్తున్నది. అయితే, ఇప్పుడు మరో వేరియంట్ వెలుగుచూసినట్టు వార్తలు వస్తున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్లు కంబైన్డ్‌గా ఒకే మనిషిలో గుర్తించారు. ఇలాంటి కేసుల ఇప్పటి వరకు 25 నమోదైనట్టు సైప్రస్ వైరాలజీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ డబుల్ వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని సైప్రస్…