అద్భుతమైన నటనతోనో, జాతీయ అవార్డులతోనో లేదంటే కాంట్రవర్సీలతోనో వార్తల్లో ఉంటుంది కంగనా రనౌత్. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా పచ్చనైన సందేశంతో నెటిజన్స్ ముందుకొచ్చింది. కంగనా 20 చెట్లు నాటింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చిన్నపాటి సందేశాన్ని కూడా తన ఫాలోయర్స్ కి ఇచ్చింది ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్…ఈ మధ్య వచ్చిన తౌక్టే తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ లో కల్లోలం సృష్టించింది. ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు,…
చూసేవాడికి కామెడీ సినిమా, సీరియస్ సినిమా, యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీ… ఇలా చాలా రకాలుంటాయి. కానీ, సినిమా తీసేవాడికి మాత్రం, ప్రతీ చిత్రం, థ్రిల్లరే! ఎందుకంటే, సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఎక్కడ తేడా వచ్చినా కోట్లు కోట్టుకుపోతాయి. ఒక్కోసారి ఒకే ఒక్క సినిమా వల్ల లాస్ తో కొట్టు మొత్తం మూసేసి వెళ్లిపోతుంటారు నిర్మాతలు! తాను అటువంటి రకం కాదంటున్నాడు బోనీ కపూర్…బాలీవుడ్ సీనియర్ నిర్మాతగా బోనీ కపూర్ కు సినిమా కష్టాలు…
ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న బాలీవుడ్ ప్రేమికులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇల్లు కూడా ఈ తుపాను ధాటికి స్వల్పంగా దెబ్బతింది. మెయిన్ గేట్ దగ్గర భారీ చెట్లు విరిగి ఇంటిపై పడ్డాయి. నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు భారీ క్రేన్ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. దానికి…
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్. ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు…
ఓవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు.. తుఫాన్… కేరళను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చడంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం,…