ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న బాలీవుడ్ ప్రేమికులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త ఇల్లు కూడా ఈ తుపాను ధాటికి స్వల్పంగా దెబ్బతింది. మెయిన్ గేట్ దగ్గర భారీ చెట్లు విరిగి ఇంటిపై పడ్డాయి. నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు భారీ క్రేన్ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
కాగా తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గోవా, గుజరాత్లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.