భారీ వర్షాలు… అక్కడ రెడ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు.. తుఫాన్… కేరళను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చడంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.. ఇక, లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు అధికారులు… ఈ తౌక్టే తుఫాన్ ఈ నెల 17, 18 తేదీల మధ్య తీరం దాటుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరోవైపు.. ఎన్‌డీఆర్ బృందాలను సిద్ధం చేస్తున్నారు.. మరోవైపు.. కేరళలో కోవిడ్ ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున.. ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు సవాల్‌గా మారిపోయింది.. పునరావాస కేంద్రాలతో మహమ్మారి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!