Minister Nara Lokesh: మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కూటమి సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.. అయితే, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే జగన్.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు.. కానీ, మీ వైపు చూపే నాలుగు వేళ్లు ఉన్నాయని మాత్రం మర్చిపోతున్నారు, అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. Read Also: PNB LBO…
YS Jagan: మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాల్లో ఈరోజు (అక్టోబర్ 30న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు.
Nara Lokesh: మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ కేంద్రంలో రెండో రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.. వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రత, ఇప్పటివరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.. మొంథా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులను ఆరా తీశారు మంత్రి నారా లోకేష్..