బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
తుఫాన్ తీవ్రత దృష్ట్యా ముందుగానే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 300 రైళ్లను రద్దు చేసింది.. ఇదే సమయంలో.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.
మిచౌంగ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో చాలా వరకు గ్రామాలన్నీ నీట మునిగాయి.. ఇక వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశానికి నిచ్చేన వేస్తున్నాయి.. మొన్నటివరకు ఐదు, పది ఉన్న టమోటా ధరలు భారీగా పెరిగాయి.. టమోటా ధర ఒక్కసారిగా 20 రూపాయలకు చేరింది. 20 కిలోలు ఉన్న టమోటా బాక్స్ ధర 400 రూపాయలు పలికింది. అంటే కిలో…