మాండూస్ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది.