సైబర్ క్రిమినల్స్ రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా అమీర్ పేటకు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ కాల్ ద్వారా హనీ ట్రాప్ చేసి అందిన కాడికి దోచుకున్నారు సైబర్ చీటర్స్. అమీర్ పెట్ కు చెందిన వృద్ధుడికి జూన్ మొదటి వారం నుంచి మాయ రాజ్ పుత్ అనే మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్ చేశారు స్కామర్స్. చనువుగా మాట్లాడుతూ వృద్ధుడిని హనీ ట్రాప్ చేశారు.
Also Read:Nara Rohith : టీడీపీ అధికారంలో ఉంటేనే సినిమాలు.. నారా రోహిత్ క్లారిటీ
తరువాత వైద్యం ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించడం కోసం అంటూ డబ్బులు లాగారు. బాధితుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రూ. 7 లక్షల 11 వేలు కాజేశారు స్కామర్స్. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో వృద్ధుడు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు.