స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్‌లైన్‌లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.…