ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసి రూ. 12 కోట్లకు పైగా డబ్బులను కేటుగాళ్లు కాజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా.. మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మల్లింపుకు సంహరించిన ఖాతాదారులపై పోలిసుల దృష్టి సారించారు. దీంతో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ బెంగుళూరు పూణే ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీస్ బృందాలు…
హైదరాబాద్ లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సైబర్ దాడిలో మహేష్ బ్యాంకు నుంచి నిందితులు రూ. 12 కోట్లు మాయం చేశారు. ఈ 12 కోట్లను సైబర్ 120 అకౌంట్లలోకి బదిలీ చేసినట్లు, మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్ పై ఈ దాడి జరిగినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాజహాన్…
అవకాశం దొరికితే చాలు మోసగాళ్ళు డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఒక బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి కోట్లరూపాయలు కాజేసిన సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ యువకుడికి షాకిచ్చారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ కు చెందిన నితిన్ తన అక్క పెళ్లి కోసం లక్షరూపాయలకు పైగా బ్యాంకులో దాచుకున్నాడు. నితిన్ దాచుకున్న లక్ష రెండు వేల రూపాయలు ఓ లింకు ఓపెన్ చేయడంతో ఖాళీ అయిపోయాయి. ఆన్ లైన్ ట్రాన్షాక్షన్ పనిచేయడం…
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్‌లో సేవలందించారు. విజయవంతంగా సేవలు…
ఒకప్పుడు దొంగతనం చేయాలంటే.. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లాలి.. బెదిరించో.. అదిరించో.. ఇంకో విధంగానో అందినకాడికి దండుకునేవారు… కానీ, ఆధునిక యుగంలో అంతా మారిపోయింది.. అంతా స్మార్ట్ అయిపోయారు.. చివరికి దొంగలు కూడా టెక్నాలిజీని ఉపయోగించి స్మార్ట్‌గా కొట్టెస్తున్నారు.. తాజాగా, గేట్ వే సంస్థపై సైబర్ ఎటాక్ జరిగింది.. అరగంట వ్యవధిలో కోటి 28 లక్షల రూపాయలు కాజేశారట కేటుగాళ్లు.. ఇంకా భారీగానే కొట్టేసే ప్రయత్నం చేయగా.. అలారం మోగడంతో అప్రమత్తమైన ఆ సంస్థ అధికారులు.. ఆ ప్రయత్నాని…
క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, ఫోన్ నంబర్‌లతో సహా పదేళ్లకు సంబంధించిన విలువైన ఎయిర్ ఇండియా కస్టమర్ డేటా ఫిబ్రవరిలో భారీ సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ సంఘటనలో 2011 ఆగస్టు 26 నుండి 2021 ఫిబ్రవరి 3 మధ్య ఉన్న 45 లక్షల మంది కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఇప్పుడు వెల్లడించింది ఎయిర్ ఇండియా. ప్యాసింజర్ సిస్టమ్ ఆపరేటర్…