ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసి రూ. 12 కోట్లకు పైగా డబ్బులను కేటుగాళ్లు కాజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా.. మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మల్లింపుకు సంహరించిన ఖాతాదారులపై పోలిసుల దృష్టి సారించారు. దీంతో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ బెంగుళూరు పూణే ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీస్ బృందాలు పయనమయ్యాయి. బెంగుళూరులో ముగ్గురు, ఢిల్లీ లో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పది నుండి పదిహేనుశాతం కమీషన్ తీస్కొని నగదు విత్ డ్రా చేసి ప్రధాన సూత్రదారులకు డబ్బులను ఖాతాదారులు అందచేసిట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తోనే సూత్రదారులు ముందస్తుగా ఖాతాదారులను సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పేద కుటుంబాలకు చెందిన యువత, విద్యార్థులకు కమీషన్ ఎరవేసి ముగ్గులోకి లాగినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల నుండి నగదు తెచ్చేందుకు ప్రత్యేకంగా ఇరవై మందికి పైగా నైజీరియన్లను సూత్రదారులు నియమించుకున్నట్లు తెలుస్తోంది.