ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట…
2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.…
Women’s ODI WC winners: ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి.. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్‌ప్రీత్ సేన తెరదించింది. ఈ విజయంతో భారత దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలవగా..…
భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజీలాండ్ మెన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డును భారత…