దేశంలో దొంగనోట్లు వరదలా వచ్చిపడుతున్నాయి..ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి.. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని… రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. అటు కావలి నుండి ఇటు శ్రీకాకుళం వరకు… ఇటు సత్తుపల్లి నుండి హైదరాబాద్ వరకు…
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…
నిజామాబాద్ జాతీయ రహదారి పై కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నోట్లని తుక్కు గా మార్చి తగలబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నోట్లు భారీగానే వున్నట్టుగా చెబుతున్నారు. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒక వాహనం నుండి సంచి పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై తగలబెట్టినవి దొంగ నోట్లా అసలు నోట్లా అనే దానిపై విచారణ జరుగుతోంది. జాతీయ…
క్రిప్టో కరెన్సీ… ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. ఎవరి అజమాయిషిలో లేని విధంగా డి సెంట్రలైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఈ క్రిప్టోకరెన్నీ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి అజమాయిషి ఉండనప్పటికీ అరాచక శక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తె దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా యువత తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన దేశాలు క్రిప్టో కరెన్సీపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని…
విధి ఆడే చదరంగంలో మనం ఓడిపోతూ వుంటాం. అన్నీ బాగున్నాయనుకునేలోపే అంచనాలు తలక్రిందులవుతాయి. కష్టపడి డబ్బు ఒక్కోసారి అక్కరకు రాకుండా పోతుంది. గుండె ఆపరేషన్ కొరకు కష్ట పడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు చెదలు పట్టి నాశనం అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా వుంటుంది. నెల్లూరు జిల్లా వాకాడు బీసీ కాలనీ కి చెందిన షేక్ మహబూబ్ బాషాకి అలాంటి పరిస్థితి ఎదురైంది. నాలుగు నెలలు క్రితం గుండె ఆపరేషన్ కొరకు ఇంటిలో ఉన్న పాడి…
దేశంలో కరెన్సీ నోట్లపై జాతిపిత గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది. బోసి నవ్వులు నవ్వుతూ ఉండే ఆ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లదు. దేశంలో స్వాతంత్య్రం రాకముందు నుంచే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్య్రం రాక ముందు ఉన్న కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949తో ఇండియా రూపాయి నోటును అందుబాటులోకి తీసుకొచ్చింది. రూపాయినోటుపై కింగ్ జార్జ్ బొమ్మకు బదులుగా మహాత్మా గాంధీ బొమ్మను ఉంచాలని ఆర్‌బీఐ…
నోటు అనగానే మరకు దానిపై మహాత్మగాంధీ బొమ్మ గుర్తుకు వస్తుంది. గాంధీ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లుబాటు కాదు. అయితే, ఇప్పుడు ఆ గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రూ.2000, రూ.500 నోట్లను అవినీతితో పాటుగా బార్లలోనూ వినియోగిస్తున్నారని, అలా ఉపయోగించే వాటిపై గాంధీ మహాత్ముడి బొమ్మ ఉండడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు.…
ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రజలు బహిర్బూమికి వెళ్తుంటారు. మానవ వ్యర్ధాలు పంటపొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంటాయి. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా వరకు టాయిలెట్‌లను వినియోగిస్తున్నారు. మనకు బయట పబ్లిక్ టాయిలెట్‌లు కనిపిస్తుంటాయి. వాటిని మనం డబ్బులు ఇచ్చి వినియోగించుకుంటుంటాం. కానీ, దక్షిణ కొరియాలోని సియోల్‌లో పబ్లిక్ టాయిలెట్‌లను వినియోగించిన వారికి డబ్బులు పే చేస్తుంటారు. ఎందుకు అలా అనే డౌట్ రావొచ్చు. ఉల్సాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్డ్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ చో జై…