ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రజలు బహిర్బూమికి వెళ్తుంటారు. మానవ వ్యర్ధాలు పంటపొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంటాయి. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా వరకు టాయిలెట్‌లను వినియోగిస్తున్నారు. మనకు బయట పబ్లిక్ టాయిలెట్‌లు కనిపిస్తుంటాయి. వాటిని మనం డబ్బులు ఇచ్చి వినియోగించుకుంటుంటాం. కానీ, దక్షిణ కొరియాలోని సియోల్‌లో పబ్లిక్ టాయిలెట్‌లను వినియోగించిన వారికి డబ్బులు పే చేస్తుంటారు. ఎందుకు అలా అనే డౌట్ రావొచ్చు. ఉల్సాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్డ్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ చో జై వూన్ అనే వ్యక్తి ఓ కొత్తరకం మరుగుదొడ్డిని తయారు చేశారు. ఈ మరుగుదొడ్డి మానవ వ్యర్ధాలను మీథేన్ గ్యాస్ గా మారుస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ నుంచి విద్యుత్, బయోగ్యాస్, ఎరువును తయారు చేస్తున్నారు. మానవ వ్యర్ధాలనుంచి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ టాయిలెట్‌లను వినియోగించే వారికి కొంత డబ్బును డిజిటల్ రూపంలో చెల్లిస్తుంటారు. ఈ డిజిటల్ మనీని వినియోగించుకొని కావాల్సిన వాటిని కొనుగోలు చేయవచ్చట.