కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తే, త్వరలో ఆర్బీఐ ముద్రించే నోట్లపై నరేంద్ర మోడీ బొమ్మను వేసే అవకాశాలు ఉన్నాయని.. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ బదులుగా నరేంద్ర మోడీ బొమ్మను ముద్రించినా ఆశ్చర్యం లేదని మండిపడ్డారు మంత్రి కేటీఆర్
కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మను మార్చబోమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఫొటోలను ముద్రించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన సోమవారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్లపై ఇతరుల ఫోటోలు ముద్రించాలన్న కొత్త…
దేశంలో ఇప్పటివరకు మన కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మ గాంధీ ఫోటోలను మాత్రమే ఆర్‌బీఐ ముద్రించింది. అయితే కరెన్సీ నోట్లపై తాజాగా మరో ఇద్దరు ప్రముఖుల చిత్రాలు ముద్రించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫొటోలను కొత్తగా విడుదలయ్యే కొన్ని డినామినేషన్ నోట్లపై ముద్రించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు తెలుస్తోంది. Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం…
అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్లు పడిపోవడం మనం చూశాం. కానీ నదిలోంచి కరెన్సీ కట్టలు కొట్టుకువస్తే ఎలా వుంటుంది. అలాంటి అనుభవమే ఎదురైంది రాజస్థాన్ అజ్మేర్లోని పోలీసులకు. ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల కరెన్సీ నోట్ట కట్టలు తేలియాడుతూ రావడంతో పోలీసులు షాకయ్యారు. ఈ నోట్లు కూడా పాలిథీన్ బ్యాగులో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంచిలో మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు తెలిపారు.…
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో జిల్లాలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… శంకర్‌రాయ్ అనే వ్యక్తి ఇంట్లో లెక్కలేని డబ్బు ఉందంటూ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంకమ్‌ట్యాక్స్ అధికారులు శంకర్‌రాయ్ నివాసంలో సోదాలు నిర్వహించగా రూ.కోటి విలువైన నోట్ల కట్టలను సంపులో దాచినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. సంపులో దాచిన ఆ నోట్ల కట్టల బ్యాగును బయటకు తీసిన అధికారులు.. తడిసిపోయిన నోట్లను డ్రయ్యర్ తో ఆరబెట్టారు. ఇస్త్రీ…
గతంలో రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు విరివిగా కనిపించేవి. కాని ఇప్పుడు ఆ నోట్లు దాదాపుగా కనిపించడం లేదు. పాత నోట్లు ఏవైనా ఉంటే అవి కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. రూపాయి నుంచి 2000 నోటు వరకు అన్నింటిని చూశాం. అయితే, దేశలో మరో నోటు కూడా ఉన్నది. అదే జీరో నోటు. జీరోకు పెద్ద వ్యాల్యూ ఉండదు. ఈనోటును అవినీతిని అరికట్టేందుకు వినియోగిస్తున్నారట.…
మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. నల్లధనం కట్టడి చేయడం కోసం అంటూ 2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.20, రూ.10 నోట్లను తీసుకువచ్చింది. కానీ ఐదేళ్లు గడిచినా నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు మోదీ సర్కార్ వైఫల్యంపై…