ఓ వృద్ధుడు కష్టపడి సంపాదించినా సొమ్మును ఎలుకలు కొరికాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారులోని ఇందిరానగర్ కాలనీతండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే భూక్య రెడ్యా.. గత నాలుగు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపులో కణతి కాగా.. దానిని శస్త్రచికిత్స చేసి తొలగించేందుకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కూరగాయల వ్యాపారం చేసే రెడ్యా.. ఓవైపు బాధను భరిస్తూనే కూరగాయలు అమ్ముతూ డబ్బులు కూడబెడుతూ…