కీరదోసకాయతో మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానితో పాటు మన చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
Summer Tips: వేసవి వచ్చిందంటే శారీరకంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బలహీనత మొదలైనవి వస్తాయి.