కేంద్ర ప్రయోజిత పథకాలు, నిధుల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదన్నారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు పెట్టేయాలని సీఎం ఆదేశించారు. సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పెండింగులో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని మంత్రి చెప్పారు.…