తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.