తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్‌ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. అధికారులు సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది.
ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, ర