Crocodiles attack: ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. కాలక్షేపం కోసం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసళ్లు దాడి చేశాయి. మొసళ్లు చంపి తిన్నాయి. ఈ ఘటన ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. 65 ఏళ్ల బాధితుడిని కేవిన్ దర్మోడీ అని గుర్తించారు. శనివారం చేపలు పట్టేందుకు వెళ్లిన అతను మొసళ్ల దాడిలో చిక్కుకున్నాడు.