గుంటూరు జిల్లా తెనాలిలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మీచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శిస్తున్నారు. తెనాలి మండలం నందివెలుగు దగ్గర చంద్రబాబుకు టీడీపీ- జనసేన శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మీచౌంగ్ తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.. ఈ తుఫాన్ అసాధారణమైనది, రాష్ట్రం మొత్తం ప్రభావితమైంది.. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి సాయం అందాలి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన మీకు సాయం అందేలా చేస్తాను అని ఆయన చెప్పారు. కరువు దెబ్బకు సగం పంటలు వేయలేదు.. ఇప్పుడు వేసిన పంట తుఫాన్ కు నీటిపాలైంది.. రైతును చూస్తే బాధ కలుగుతుంది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Read Also: Earthquake: వరుస భూకంపాలు.. నాలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి..
90 శాతం పంట పొలాల్లోనే ఉంది అని చంద్రబాబు అన్నారు. ఓ వారం రోజులు ఆగితే పంట చేతికి వచ్చేది.. తుఫాన్ ను నివారించలేం కానీ, ఇప్పుడు జరిగిన నష్టానికి మానవ తప్పిదం కూడా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రైతులు ఈ స్థాయిలో నష్టపోయారు.. పంట కాలువల సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. నాలుగు సంవత్సరాలుగా ఒక కాల్వ తవ్వలేదు, ఒక్క మురుగు కాల్వను శుభ్రం చేయలేదు అని ఆయన విమర్శలు గుప్పించారు. ఇంత నష్టం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం రాలేదు.. ప్రధానమంత్రి ఫసల్ బీమా కడితే రైతులకు నష్ట పరిహారం వచ్చేది.. రైతులకు న్యాయం జరగాలి అని చంద్రబాబు తెలిపారు.
Read Also: CM Yogi Adityanath : యూపీలో సామూహిక కళ్యాణోత్సవం.. సీఎం యోగీ 17గిఫ్టులు
దేశంలో అప్పుల పాలైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది.. ప్రతిపక్ష నాయకులు రైతుల కోసం రాకపోతే, ఈ ముఖ్యమంత్రికి కదలిక వచ్చేది కాదు.. సీఎం జగన్ తుఫాన్ వచ్చిన ప్రాంతంలో పర్యటించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.. నాలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించిన భయం సీఎంను వెంటాడుతుంది.. చేయని తప్పుకు జైల్లో పెట్టారు.. నేను ఎంత క్షోభ పడ్డానో ప్రజలు ఆలోచించాలి.. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది.. అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో మూడు నెలల తర్వాత తెలుస్తుంది.. ప్రజల తరఫున పోరాడితే, నాయకులను జైల్లో పెడుతున్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది.. అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశాం.. మరో మూడు నెలల్లో ఇక్కడా చూస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.