వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు…