NCRB : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 వార్షిక నివేదికను విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 4 శాతం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది మహిళలపై మొత్తం 4,45,256 కేసులు నమోదయ్యాయి.
మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయవచ్చని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నొక్కి చెప్పారు.