Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను వేధించాడని స్నేహితుడిని అతి దారుణంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. మృతుడి మొబైల్ ద్వారా వివరాలు సేకరిస్తారని దానిని బావిలో పడేశాడు. మృతుడు సైన్యంలో పనిచేసి రిటైరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.
వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Mumbai: ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా మాట్రిమోనల్ సైటుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకోవడమే ఎక్కువ అవుతోంది. తమ పిల్లలకు తమ స్థాయి, హోదా కలిగిన వధువు/వరుడిని వెతికేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మాట్రిమోనల్ సైట్లపై ఆధారపడుతున్నారు. తమకు తెలిసిన బంధువులు, చుట్టాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా గొప్పలకు పోతూ మాట్రిమోనీల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.
Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ యువకుడితో ప్రేమలో ఉన్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా సదర్ కొత్వాలి మంఝన్‌పూర్ ప్రాంతంలోని తేజ్వాపూర్ గ్రామంలో 5 రోజుల క్రితం బావిలో తలలేని ఓ టీనేజ్ బాలిక మృతదేహం లభ్యమైంది.
Bihar: బీహార్ రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిలో ఒక వ్యక్తి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. నర్హత్ గ్రామంలోని కాంగ్రెస్ నేత నీతూ కుమార్ ఇంట్లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు పీయూష్ సింగ్ గా గుర్తించారు. డెడ్ బాడీ దొరికిన సమయంలో ఎమ్మెల్యే నీతూ కుమార్ ఇంట్లో లేరని తెలిపారు.
Delivery Boy: నోయిడాలో దారుణం జరిగింది. సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్, ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు లొంగిపోతున్నట్లు నటిస్తూ.. పిస్టల్ తీసుకుని పరారయ్యాడు. పోలీసులు అతికష్టం మీద నిందితుడి కాలుపై ఫైర్ చేసి పట్టుకున్నారు.