జార్ఖండ్‌లో స్పానిష్ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ టూరిస్ట్ అయిన మహిళపై అతని భాగస్వామిపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. ఈ పీడకలకు సంబంధించి స్పానిష్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ముఖం నిండా గాయాలతో భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఎవరూ కోరుకోనిద మాకు జరిగింది. ఏడుగురు వ్యక్తులు…
Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్‌నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్‌లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.
Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్‌కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్‌లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్‌లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్‌తో చివరిసారిగా కనిపించింది.
Crime: ఆన్‌లైన్, సోషల్ మీడియా పరిచయాలు అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చాలానే నమోదయ్యాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దబ్రీ మెట్రోస్టేషన్ సమీపంలో బాలిక అపాస్మారక స్థితిలో కనిపించిందని పోలీసులు బుధవారం వెల్లడించారు.
ఇదిలా ఉంటే, అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్(38) పటాన్చెరు పరిధిలోని అమీన్పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.
Gaming addict: ఆన్‌లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
Honour killing: తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్‌పుత్‌పై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయి. తనను పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల బాధితురాలు మనోజ్ రాజ్‌పుత్‌కి బంధువు. శుక్రవారం దుర్గ్ జిల్లాలోని అతని కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నారు.