ఒక్కగానొక్కడ కొడుకు.. ఘనంగా పెళ్ళి నిర్వహించాలని బంధుమిత్రులందరినీ తల్లిదండ్రులు ఆహ్వానించారు.. అందరూ విచ్చేయడంతో పండగ వాతావరణం నెలకొంది.. రాత్రంతా అందరూ సంతోషంగా గడిపారు.. ఉదయమే లేచి ఇతర పనులన్నీ సిద్ధం చేసుకోవాలని అనుకొని పడుకున్నారు.. తీరా ఉదయం లేచి చూస్తే.. పెళ్ళి కొడుకు చేసిన పనికి విషాదఛాయలు అలుముకున్నాయి. వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత, తన గదిలోకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని మల్కాపురం జయేంద్రకాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..…
తన చిన్ననాటి స్నేహితుడ్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి మందలించడంతో, చివరికి భార్యని తీసుకొని పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు.…
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా…
చెన్నైలోని ఫాంహౌస్ లో ఎన్ఆర్ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు (టీఎన్ 07 ఏడబ్ల్యూ 7499) ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్ (58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్ ఉంది.…
పాట్నాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి పెట్టే హింసల్ని తాళ్ళలేక, ఆ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనని కాపాడని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులకు ఆ వీడియో చేరడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు(50) సమస్తిపూర్లోని రోసెరా ప్రాంతంలో…
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్…
ప్రేమ వివాహం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిని యువతి తరుపు బంధువులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్కు చెందిన యువతి (23) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అయితే.. వీరు..…
అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. పక్కా రెక్కీ, పక్క స్కెచ్ ప్రకారమే యశ్వంత్, జ్యోతిల హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కొత్తగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ పలుసార్లు వచ్చినట్టు గుర్తించారని.. అయితే ఇద్దరినీ గతంలో జ్యోతి భర్త శ్రీనివాస్ రావు ఫాలో అయ్యాడు. ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుండి యశ్వంత్ ను ఫాలో అయిన శ్రీనివాస్ రావు.. అప్పటికే సుపారీ గ్యాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు. భార్య ప్రవర్తనతో ఇద్దరిపై…
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే.. రెండు మృతదేహాలు వారసిగూడ చెందిన యువకుడు యశ్వంత్ మహిళ జ్యోతి గా పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్గా యశ్వంత్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం ఫోన్ కాల్ రావడంతో యశ్వంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మృతిచెందిన జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో 3 ప్రత్యేక బృందాలను పోలీసులు…
సాగరతీరం విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఆర్అండ్ అతిథి గృహం వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి శిశు గృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శిశు గృహ సంరక్షకులు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డుపై ఉన్న ముగ్గురు చిన్నారులను వారం రోజుల క్రితం గుర్తించిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు శిశు గృహంలో చేర్చారు. తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణగా…