Jr NTR : జూనియర్ ఎన్టీఆర్కి భుజానికి తీవ్ర గాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ ప్రియులకు ఒక విచారకరమైన వార్త. సోమవారం (జులై 27) సాయంత్రం ఎన్టీఆర్కు అనుకోకుండా భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్య నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
అయితే, ఈ గాయం పట్ల అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంగారు పడాల్సిన పనిలేదని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతితో త్వరలోనే కోలుకుంటారని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారిక తాజా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆయన కొన్ని వారాల పాటు షూటింగ్లకు దూరంగా ఉండనున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..