Rape Case: బీహార్‌లోని ఆత్మగోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించి, అదే గ్రామానికి చెందిన నిందితుడైన ఓ యువకుడు, అతని తల్లిని అరెస్టు చేశారు. ఆ బాలిక మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు.. యువకుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. నిందితుడి తల్లితో కలిసి ఆ మృతదేహాన్ని పొలంలో పడేశారు.
Lawrence Bishnoi Gang : దాదాపు నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని ముంబైలో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఇద్దరు దుండగులు అతని ఇంటిపై కాల్పులు జరిపి పారిపోయారు.
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజధాని పాట్నాలోని పున్‌పున్‌లో జేడీయూ యువనేత సౌరభ్‌కుమార్‌పై కాల్పులు జరిగాయి. అదే సమయంలో ఈ కాల్పుల్లో మరో యువకుడు గాయపడ్డాడు.