ఐపీఎల్లో తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని పతిరణ మేనేజర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌తో ఎంఎస్ ధోని మరోసారి క్రికెట్ మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఎంస్ ధోనీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఆర్సీబీతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఎంఎస్ ధోని మరోసారి అందరికీ షాకిస్తూ కెప్టెన్సీ నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మహి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎంఎస్ ధోనీ తన జీవితంలోని ప్రతి ప్రధాన నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ఈ పద్ధతిలోనే తీసుకున్నాడు.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ మధ్య జరుగనుంది. అందుకోసం ఫ్యాన్స్ ఇప్పటికే.. చెన్నై చెపాక్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.