పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠపోరులో కోల్ కతా గెలుపొందింది. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో క్లాసెన్ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని అనుకుంటే.. హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో కీలక క్లాసెన్ (63) వికెట్ తీశాడు. అంతకుముందు షాబాజ్ అహ్మద్ ను ఔట్ చేశాడు. చివరి బంతికి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ముందు ఓ భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్ కతా బ్యాటింగ్ లో ముందుగా ఓపెనర్లు.. ఫిలిప్ సాల్ట్ (54) పరుగులతో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ…
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. మరికాసేపట్లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శనివారం రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్-ఢిల్లీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.