ఓవైపు తీర్పు.. మరోవైపు విచారణ.. చంద్రబాబు కేసులో ఉత్కంఠ..!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంతో పాటు హైకోర్టులోనూ చంద్రబాబు కేసుల విచారణ సాగుతోంది. ఇక, బుధవారం రోజు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ కొనసాగగా.. ఈ రోజు తీర్పు వెలువడనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి అయ్యాయి.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోతైన విచారణ కోసం చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరంది సీఐడీ.. వాదనలు ముగియడంతో.. తీర్పు ఇవాళ్టికి వాయిదా పడింది.. అయితే, తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ1గా ఉన్నారు చంద్రబాబు.. ఇప్పటికే IRR కేసులో ఐటీ వారెంట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సీఐడీ.. అయితే, ఈ కేసులో నేడు విచారణ చేపట్టనుంది హైకోర్టు.. ఇక.. చంద్రబాబు పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లను సీఐడీ దాఖలు చేయగా.. నిన్నే పీటీ వారెంట్ల మీద విచారణ జరపాలని సీఐడీ కోరగా ఏసీబీ కోర్టు నిరాకరించింది.. అయితే, నేడు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు తర్వాత పీటీ వారెంట్‌పై విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు.
వినాయక మండపంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
ప్రాణాలు ఎప్పుడు.. ఎలా పోతాయో చెప్పలేం అంటుంటారు పెద్దలు.. అయితే, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రోగాలకు వైద్యం అందుతోంది.. అది కొందరికే పరిమితం అవుతోంది.. మరోవైపు.. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే గుండెఆగి ఎంతో మంది మరణిస్తున్నారు.. నైట్ పడుకున్నవాడు పొద్దున్నే లేస్తాడా లేదా? అనే అనుమానం కలుగుతోంది.. ఎందుకంటే.. ఎవరికి ఎప్పుడు ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడంలేదు.. మరోవైపు.. ఈ మధ్య సరదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటి కప్పుడే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్ లో బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డ్యాన్స్‌లు చేశారు కొందరు యువకులు.. స్థానికులంతా కలిసి ఆడుతూ పాడుతూ గడిపారు.. కొందరు డ్యాన్స్ చేస్తుంటే.. మరికొందరు వారిని ఉత్సాహ పరిచారు.. అయితే, ప్రసాద్ అనే 26 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ చేస్తూనే కుప్పకూలిపోయాడు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో.. స్థానికంగా విషాయచాయలు అలుముకున్నాయి.
ఏపీ అసెంబ్లీ.. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ వాయిదా తీర్మానం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు .. కళ్యాణ మస్తు పథకం, విదేశీ విద్య, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యంపై ప్రశ్నలు.. వాటికి సమాధానాలు చెప్పనుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. గ్రామ పంచాయితీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు, మంగళగిరి-తాడేపల్లి పురపాలక సంఘంలో రహదారుల విస్తరణ అంశాల పై ప్రశ్నలు వేయనున్నారు.. ఇక, ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా పై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. మరోవైపు.. ఉదయం పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. పెద్దల సభ కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకాబోతోంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం, పులివెందులలో భూ పంపిణి తదితర అంశాల పై ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.. ఇక, తొలిరోజు అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై వాయిదా తీర్మానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని ఉభయ సభల్లో పట్టుపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలను ప్రకటించిన విద్యా శాఖ..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.అయితే ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలు, సిలబస్ మరియు అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామక పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 20 మరియు 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 22 వ తేదీన స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. నవంబరు 23వ తేదీ న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో పరీక్షను నిర్వహించనున్నారు.అలాగే నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్జిటీ పరీక్షలను ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు.పరీక్షల తేదీలతో పాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ తెలియజేసింది.. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను కూడా తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష ను నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్లో వచ్చిన స్కోర్ను వెయిటేజీగా పరిగణిస్తారు.అలాగే పీఈటీ మరియు పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది.తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైంది.అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్ 20లోగా నిర్ణీత ఫీజు చెల్లింపు చేసి అక్టోబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి అయితే ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించునున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది
ఉలిక్కిపడ్డ బెంగాల్.. కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ లోకి నిపా వైరస్ ఎంట్రీ ఇచ్చిందా?
కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం రేపుతుంది. నిఫా వైరస్ పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిందా అనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు పనికోసం కేరళకు వలస వెళ్లాడు. అయితే అక్కడ ఉన్నప్పుడే అతడికి ఆరోగ్యం పాడయ్యింది. కేరళలోనే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. అక్కడి స్థానిక ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న తరువాత అతడికి జ్వరం తగ్గడంతో డిశార్జ్ చేశారు. అక్కడి నుంచి యువకుడు నేరుగా పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాడు. అయితే స్వగ్రామానికి రాగానే రెండు రోజుల్లోనే అతడు మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు. తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ లక్షణాలు నిఫా వైరస్ లక్షణాలుగా కనిపించడం, అదీకాక అతడు కేరళ నుంచి వచ్చాడు అని తెలియడంతో వైద్యులు అతడికి నిఫా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
పది అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సదరన్ కమాండ్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌తోవాషర్‌మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు.. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు అక్టోబర్ 8న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 24 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంటీఎస్ (మెసేంజర్)-13 పోస్టులు, ఎంటీఎస్ (ఆఫీస్)- 3, కుక్-2, వాషర్‌మెన్-2, లేబరర్-3.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..
లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిదో తెలుసా?
లాఫింగ్ బుద్ధ గురించి అందరికి తెలుసు.. వాస్తు దోషాలు పోవడానికి,వ్యాపారాల్లో మంచి లాభాలను పొందేందుకు లాఫింగ్ బుద్దను పెడుతుందటం మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఏర్పాటు చేయడానికి సరైన స్థానం, సరైన దిక్కు ఏంటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేర్వేరు రకాలలో ఉండే బుద్ధుని భంగిమలు వేర్వురు రకాల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, సంపద, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు… అయితే ప్రతికూల పరిస్థితులు బాగుండాలని ఈ లాఫింగ్ బుద్దను పెడతారు.. లాఫింగ్ బుద్దను ఇంట్లో పెట్టడం వల్ల ప్రశాంతత లభిస్తుందని జనాలు ఎక్కువగా నమ్ముతారు.. అయితే మీ ఇంట్లో ఈ దిశలలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచితే మీకు సరైన శక్తి ఉత్పత్తి చేయడంతో పాటు మీ సంపదర పెరుగుతుందట. ఇంటి ప్రధాన ముఖద్వారం వద్ద లాఫింగ్ బద్ధుని విగ్రహాన్ని ఉంచాలి. అది మీకు కంటికి కనబడేలా తక్కువ ఎత్తులా ఉండేలా చూసుకోవాలి.. మరీ ఎత్తులో ఉండకుండా చూడటానికి వీలుగా ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది.. బుద్ధుడు ఇంట్లో ఉండటం వల్ల ఒత్తిడి దూరం అవ్వడమే కాదు.. ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే ఇంట్లోని ప్రవేశ ద్వారం వద్ద బుద్ధుడు ఆశీర్వాద భంగిమలో ఉండేలా చూసుకోవాలి. ఇలా బుద్ధుని విగ్రహంను ఇంట్లో ఉంచడం వల్ల వ్యతిరేక శక్తులు అన్నీ ఇంటి నుండే బయట ఉండిపోతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధుడిని పడమర వైపు దిశ వైపు చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా ఉంచితే మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీకు సాయంత్రం వేళ తోటలో లేదా పార్కుల్లో నడిచే అలవాటు ఉంటే అక్కడ ఒక పరి శుభ్రమైన ప్లేసులో ద్యానం చేస్తున్న బుద్ధుడిని ఉంచడం మంచిది.. అంతేకాదు ఆ విగ్రహం చుట్టు దీపాలు పెట్టడం వల్ల ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది..
ఏజెంట్ బాటలో స్కంద… చాలా చెప్పారు కానీ కొంచమే చేస్తున్నారు
అక్కినేని అఖిల్ నటించిన లాస్ట్ సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ముందుగా పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ అయ్యింది. సురేందర్ డైరెక్షన్, అఖిల్ స్టైలిష్ స్పై అనగానే ఏజెంట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఏజెంట్ సినిమా గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే వాయిదా పడుతూ వచ్చి పాన్ ఇండియా రిలీజ్ నుంచి కేవలం తెలుగు రిలీజ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. మల్టీలాంగ్వేజ్ రిలీజ్ అనుకోని లాస్ట్ కి సింగల్ లాంగ్వేజ్ కి స్టిక్ అయ్యింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్లు ఉంది స్కంద సినిమా. రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే డిఫరెంట్ కాంబినేషన్ అనే పేరు తెచ్చుకుంది. గ్లిమ్ప్స్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఊర మాస్ పాన్ ఇండియా సినిమాని చూడబోతున్నాం అనే ఫీలింగ్ లో ఉన్న సినీ అభిమానులు స్కంద సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ డేట్ ప్రీపోన్ పోస్ట్ పోన్ అవుతూ స్కంద మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ వాయిదా పడడంతో ఆ డేట్ కి దిగుతున్న స్కంద సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో బజ్ జనరేట్ అవ్వట్లేదు. రిలీజ్ మరో వారం రోజులు ఉంది కానీ చిత్ర యూనిట్ ఇంకా బయటకి వచ్చి ఎక్కడా కనిపించట్లేదు. తెలుగులోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇతర భాషల్లో స్కంద ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. పాన్ ఇండియా సినిమా చేయాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అంటే ప్రమోషన్స్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాలి. స్కంద సినిమా విషయంలో సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ ఇతర భాషల్లో కూడా వస్తున్నాయి కానీ ప్రమోషన్స్ మాత్రం జరగట్లేదు.
దేవర షూటింగ్ వల్లే ఎన్టీఆర్ బాబాయ్ ని కలవలేదా?
తెలుగు సినిమా దిగ్గజం… తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్లలో ముఖ్యుడు స్వర్గీయ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. సినీ అభిమానులతో ఏఎన్నార్, నాగి గాడు అని ప్రేమగా పిలిపించుకున్న ఈ దసరా బుల్లోడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ లు తెలుగు సినిమాకి చేసిన సేవ తారలు గుర్తుంచోకోవాల్సినది. స్టార్ హీరోలుగానే కాదు మంచి స్నేహితులుగా ఎలా ఉండాలో కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్ లని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే నందమూరి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ సభ్యులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. తరాలు మారుతున్న రెండు కుటుంబాల మధ్య బంధం మాత్రం మారలేదు. జనరేషన్స్ ఆ రిలేషన్స్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సంధర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, నాని, విష్ణు, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు వచ్చారు. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు గెస్టులని వెల్కమ్ చేసారు. ఈ వేడుకకి నందమూరి కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎంతో సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్ కూడా వెళ్లలేదు. ఎన్టీఆర్-నాగార్జునని బాబాయ్ బాబాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. అలాంటి బాబాయ్ ఎన్టీఆర్ ని పిలవలేదా? లేక పిలిచినా ఎన్టీఆర్ వెళ్లలేదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. అయితే ఎన్టీఆర్ ఈ విగ్రహ ఆవిష్కరణకి రాకపోవడానికి కారణం దేవర షూటింగ్ అని తెలుస్తోంది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్, దేవర షూటింగ్ ని మళ్లీ మొదలుపెట్టాడు. ఈ షూటింగ్ లో ఉన్న కారణంగానే ఎన్టీఆర్, ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణకి రాలేదని సమాచారం.