రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్థాన్ జట్టు.. 2023 ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించింది. నెదర్లాండ్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ గెలవడానికి చెమటోడ్చవలసి వచ్చింది.
మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన A to Z వివరాలివే.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.