‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో హైదరాబాద్ జట్టు వ్యూహాత్మక లోపాలు, ఆటపై కనీస అవగాహన లేకపోవడం వల్లే 47 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిందని విమర్శించాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్, ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఆటతీరును తప్పుపట్టాడు. రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ మినహా మిగిలిన బౌలర్లలో పెద్దగా పదును లేదని, ఈ విషయాన్ని గమనించకుండా హైదరాబాద్ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారని అన్నాడు. క్రీజులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటే రవీంద్ర జడేజా, యశ్ రాజ్ పుంజాలను రాజస్థాన్ రంగంలోకి దించలేకపోయేదని, కానీ ఆ లాజిక్‌ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు పూర్తిగా మర్చిపోయారని విశ్లేషించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పేలవ ఫామ్‌పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో హెడ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం సరైన నిర్ణయం కాదని, అతను అసలు ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎలాంటి బాధ్యత లేకుండా అనవసర షాట్ ఆడి హెడ్ వికెట్ కోల్పోయాడని మండిపడ్డాడు.
ఈ సీజన్లో పిచ్‌లను, పరిస్థితులను అంచనా వేయడంలో హైదరాబాద్ పదే పదే విఫలమైందని అశ్విన్ గుర్తుచేశాడు. గతంలో లక్నో, కోల్‌కతా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ ఇదే తరహా వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని, ఇప్పటికైనా మేనేజ్మెంట్ ట్రావిస్ హెడ్ స్థానంపై పునరాలోచన చేయాలని అశ్విన్ హితవు పలికాడు.
తాజావార్తలు
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
-
Asia Cup 2026 Final బెర్త్ ఎవరిది.? బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్ పోరుకు టీమిండియా రెడీ..!
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?