Home
Cricket News
Cricket News News
-
టీ20 ప్రపంచకప్‌లో ఖాతా తెరిచిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. ఓపెనర్ లూయిస్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా.. అతడికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్ పొలార్డ్ (26), సిమ్మన్స్ (16) పరుగులు చేశారు.… -
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రవిడ్
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్‌తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్… -
పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని… -
అంచనాలు తలకిందులు.. భారత్‌కు కాళరాత్రి చూపించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.… -
కోహ్లీపై విమర్శలు.. కిషన్‌ను కాదని పాండ్యాను తీసుకుంటారా?
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ తన విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత… -
ఆదుకున్న కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13)… -
అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన షకీబ్
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్లో నిశాంక, అవిష్క ఫెర్నాండో వికెట్లను షకీబ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు రికార్డులకెక్కాడు. శ్రీలంక జరుగుతున్న మ్యాచ్‌లో తీసిన రెండు వికెట్లతో కలిపి ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో షకీబ్ 41 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో… -
టీమిండియాతో హై ఓల్టేజ్ మ్యాచ్… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పిచ్‌పైనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. జట్ల వివరాలు భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్,… -
టీమిండియాలో రోహిత్ శర్మ స్పెషల్.. ఎందుకంటే..?
టీమిండియా జట్టులో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడిపై చాలా అంచనాలున్నాయి. అయితే అతడు చాలా స్పెషల్. ఎందుకంటే 2007లో టీమిండియా ఆడిన ప్రపంచకప్ జట్టులో.. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఒకేఒక్కడు రోహిత్ మాత్రమే. 2007లో 20 ఏళ్ల వయసులోనే రోహిత్ ప్రపంచకప్ ఆడాడు. అప్పుడు జట్టులో అతడే యువకుడు. ఇప్పుడు మాత్రం అతడు… -
పాక్‌పై భారత్ గెలవాలంటూ అభిమానుల ప్రత్యేక పూజలు
మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరులో భారత్ గెలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో కొందరు అభిమానులు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా భారత టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు కూడా పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టుపై భారత్ ఓడిపోలేదని.. ఈ మ్యాచ్‌లోనూ అదే రికార్డు కొనసాగించాలని…
తాజావార్తలు
-
NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
-
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
-
Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
-
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
-
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!